రాణించిన పృథ్వీ షా,రిషబ్‌ పంత్‌

రాణించిన పృథ్వీ షా,రిషబ్‌ పంత్‌

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 43 బంతుల్లో 64 పరుగులు చేశాడు.  9 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతడికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్  నుంచి మంచి సహకారం లభించింది. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన రిషబ్ పంత్ తో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. పంత్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో పియూష్ చావ్లా 2, శామ్ కరన్ ఒక వికెట్ తీశారు.