రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన.. 101 వస్తువులపై ఆంక్షలు

రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన.. 101 వస్తువులపై ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆత్మ నిర్భర భారత్ ప్రకటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసారు. 101 రక్షణ పరికరాల దిగుమతిలపై నిషేధం విధిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 101 ఆంక్షల వస్తువుల జాబితాలో సాధారణ వస్తువులు మాత్రమే కాకుండా… ఆర్టిలరీ గన్స్, అటాల్ట్ రైఫిల్స్, కొర్వెట్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఎల్‌సిహెచ్, రాడార్లు మరియు మా రక్షణ సేవల అవసరాలను తీర్చే అనేక వస్తువులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు.  2020-24 మధ్య దశల వారీగా ఈ నిషేధాన్ని అమలు చేయనున్నారు. విదేశాల నుంచి దిగుమతి ఆపడం, స్వదేశంలో ఉత్పత్తికి ఊతమివ్వడం రక్షణ శాఖ ఉద్దేశంగా తెలుస్తోంది.