సైన్యానికి పూర్తి స్వేచ్ఛ..భారత్‌ భిన్న వ్యూహం !

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ..భారత్‌ భిన్న వ్యూహం !

చైనా సైన్యం దురాక్రమణలను ధీటుగా తిప్పికొట్టేందుకు దూకుడుగా అడుగులు వేస్తోంది ఇండియా. భారత సైన్యానికి ప్రభుత్వ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఇకపై సరిహద్దుల వద్ద భారత్‌ భిన్నమైన వ్యూహాత్మక విధానాల్ని అవలంబించనున్నట్లు తెలుస్తోంది. రష్యాకు వెళుతున్న ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. భద్రతా బలగాల కోసం అత్యవసర నిధులను విడుదల చేసింది కేంద్రం. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు వెసులుబాటు కల్గించే విధంగా 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది.