ప్రభాస్ కంటే ముందు షారుక్ తో సినిమా చేస్తున్న బ్యూటీ

ప్రభాస్ కంటే ముందు షారుక్ తో సినిమా చేస్తున్న బ్యూటీ

ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే ఖరారు అయిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ కథాంశంతో ప్రభాస్ 21 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు దీపికా ను ఫిక్స్ చేశారు మేకర్స్ .  ఇదిలా ఉంటే దీపికా పదుకొనే మొదట తన డేట్స్ ను షారుక్‌ఖాన్ తో నటించనున్న పఠాన్ సినిమాకు కేటాయించింది. అదే టైమ్  లో ప్రభాస్ సినిమాకు సంతకం కూడా చేసింది. కానీ దీపికా వెంటనే షారుక్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతుందట. ఆతర్వాత ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది దీపికా. నవంబర్ లో షారుక్ ఖాన్ సినిమా షూటింగ్ ను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-21 వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.