ఆగిన స్టార్ హీరోయిన్ సినిమా.. కారణం అదే..

ఆగిన స్టార్ హీరోయిన్ సినిమా.. కారణం అదే..

ప్రస్తుతం భారీ స్టార్లందరూ నటనతో పాటుగా సినీ నిర్మాణంలోనూ సత్తా చాటుతున్నారు. సొంత సినిమాలను నిర్మిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న దీపికా పదుకొణే కూడా ఈ తరహా ఆలోచనే చేసింది. తన నటనతో టాప్ హీరోయిన్‌గా ఉన్న దీపిక ఇటీవల నిర్మాణంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో నిర్మాత మధు మంతెనను సంప్రదించింది. వీరిద్దరు కలిసి ఓ ప్రాజెక్టను రూపొందించాలని అనుకున్నారు. దీనికి మధు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ప్రాజెక్ట్‌ను కూడా లాక్ చేశారు. మహాభారతంలోని ప్రధాన ఘట్టాన్ని తెరకెక్కించాలని ఆలోచించారు. ఇందులో దీపిక ద్రౌపతి పాత్రను పోషించనుందట. అన్ని ఓకే అనుకోవడంతో సినిమా పేరును రిజిస్టర్ కూడా చేశారు. ఇదంతా జరిగి చాలా సమయం గడిచింది. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. దాని కారణం దర్శకుడు దొరకలేదు. కొందరిని సంప్రదించినా వారు తమతమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో దీనిని తిరస్కరించారు. దాంతో ఈ సినిమాను రద్దుచేయడం మంచిదని అమ్మడు భావిస్తుందట. మరి ఈ సినిమా విషయంలో చివరికి ఎటువంటి నిర్ణయం ఖరారు చేస్తారో చూడాలి.