డిసెంబర్ 3 నాటికీ కరోనా తగ్గిపోతుందట...!!

డిసెంబర్ 3 నాటికీ కరోనా తగ్గిపోతుందట...!!

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు దాటిపోయింది.  కరోనా కేసులు దేశంలో ఎప్పుడు తగ్గుతాయి అనే దానిపై ఐఓఆర్ ఓ రిపోర్ట్ ను సిద్ధం చేసింది.  ఆ రిపోర్ట్ ప్రకారం డిసెంబర్ 3 వ తేదీ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పెట్టె అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారానికి గరిష్టంగా కేసులు ఉంటాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల వరకు ఉండొచ్చని ఐఓఆర్ నివేదికలో తెలిపింది.  మహానగరాల్లో సెప్టెంబర్ చివరి నుంచి కేసులు తగ్గుముఖం పెట్టె అవకాశం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నది.  ఇక టైప్ 2,3 నగరాల్లో కరోనా కేసులు నవంబర్ నుంచి క్రమంగా తగ్గుతాయని, మొత్తానికి డిసెంబర్ 3 నుంచి కరోనా తిరోగమనం చెందుతుందని నివేదిక తెలియజేస్తోంది.