పోలవరంపై అసెంబ్లీలో చర్చ...ప్యాకేజీల పేరుతో పట్టించుకోలేదు... 

పోలవరంపై అసెంబ్లీలో చర్చ...ప్యాకేజీల పేరుతో పట్టించుకోలేదు... 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.  సభలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.  ఐదు రోజులపాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి.  మూడోరోజు సభ జరుగుతున్నది.  మూడో రోజు మొత్తం 11 బిల్లులను సభలో ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.  పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా ఈరోజు సభలో చర్చిస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  పోలవరం ఏపీకి జీవనాడి అని చెప్పే చంద్రబాబు ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని అన్నారు.  2004 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారని, 2005 నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరంను పట్టించుకోలేదని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని, కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మించేందుకు ఒప్పుకున్నారని, మారిన అంచనాలను సబ్మిట్ చేయాలనీ కోరినా గత ప్రభుత్వం కాలయాపన చేసిందని మంత్రి అనిల్ సభలో పేర్కొన్నారు.