రివ్యూ: డియర్ కామ్రేడ్

రివ్యూ: డియర్ కామ్రేడ్

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్

సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్  

నిర్మాత‌లు : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి, యాష్ రంగినేని

దర్శకత్వం : భరత్ కమ్మ 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  గీతగోవిందం జోడి తిరిగి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది.  మరి ఈ క్రేజ్ ను విజయ్ దేవరకొండ యూజ్ చేసుకున్నాడా లేదా అన్నది చూడాలి.  

కథ: 

విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్. ఆవేశం ఎక్కువ.  కాలేజీలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు అతనిది. అతనితో పాటు అదే కాలేజీలో రష్మిక చదువుతుంది. స్టేట్ క్రికెట్ ప్లేయర్.  విజయ్ గొడవలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కుదరదు.  కొన్ని సంఘటనలు అతన్ని పూర్తిగా గొడవల్లో ముంచేస్తాయి.  ఆవేశం, గొడవల కారణంగా రష్మిక, విజయ్ లు విడిపోతారు.  మూడేళ్ళ తరువాత తిరిగి ఇద్దరు కలుస్తారు.  ఈ మూడేళ్లు వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది.  గొడవల నుంచి ఎలా బయటపడ్డాడు.. అన్నది కథ.  

విశ్లేషణ: 

అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు ఇచ్చిన కిక్ తరువాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా చేయడం ఒక సాహసం అనే చెప్పాలి.  డిఫరెంట్ జానర్ లో సినిమా చేయాలి కాబట్టి ఈ సినిమా చేయాలని అనుకున్నాడు.  స్టూడెంట్ లీడర్ పాత్రలో, ఆవేశం ఉన్న యువకుడిగా విజయ్ పెర్ఫార్మన్స్ బాగుంది.  కాలేజీ ఎపిసోడ్స్, స్టూడెంట్ ఫైట్స్ అన్ని యువతకు నచ్చుతాయి.  మంచి పాయింట్ ను తీసుకున్న దర్శకుడు ఆ పాయింట్ ను ఎలివేట్ చేయడంలో ఇబ్బందులు పడినట్టు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్ ఈ గొడవలు, ప్రేమ, ముద్దు ముచ్చట్లతో లాగించేవారు.  సెకండ్ హాఫ్ లో అసలు కథ ప్రారంభం అవుతుంది.  అయితే, దాని కొద్దిగా సాగతీత ధోరణితో సినిమాను నడిపించడంతో ప్రేక్షకుడు కాస్త విసుగు చెందాడని చెప్పొచ్చు.  విజయ్ సినిమాల్లో కనిపించే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యింది.  

నటీనటుల పనితీరు: 

విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా ఆకట్టుకున్నాడు.  తన యాటిట్యూడ్ తో మెప్పించాడు.  రష్మిక క్రికెటర్ గా ఆకట్టుకుంది.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.  ఈ ఇద్దరే సినిమాకు ప్లస్ అయ్యారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు మంచి పాయింట్ ను ఎంచుకున్నా దాన్ని తెరపై చూపించడంలో విఫలం అయ్యాడు.  నేరేషన్ స్లోగా ఉండటమే మైనస్ అయ్యింది.  జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  మొత్తానికి సినిమా పర్వాలేదనిపించింది.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కథ 

మైనస్ పాయింట్స్: 

స్లో నరేషన్ 

చివరిగా: డియర్ కామ్రేడ్ : పర్వాలేదనిపించాడు.