అమెరికాలో కాల్పులు.. భయాందోళనలో ప్రజలు

అమెరికాలో కాల్పులు.. భయాందోళనలో ప్రజలు

అందరికి అభయాన్ని ఇచ్చే అమెరికా.. ఇప్పుడు భయపడుతున్నది.  అమెరికాలోనే కొంతమంది అల్లరి మూకలు గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగించుకోవడంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకును వెళ్లదీస్తున్నారు.  ఎక్కడి నుంచి ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.  గత కొంతకాలంగా గన్ కల్చర్ పెరిగిపోయిన మాట వాస్తవమే.  దీనిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. 

తాజాగా టెక్సాస్ లోని ఎల్ పాసోలోని వాల్ మార్ట్ స్టోర్లో కొంతమంది దుండగులు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  వీరి కాల్పుల్లో దాదాపుగా 20 మంది మరణించినట్టు సమాచారం.  ఈ సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.  కాల్పులకు తెగబడిన వ్యక్తుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరంతా ఎవరు.. ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎల్ పాసో పోలీసులు.  కాల్పులకు పాల్పడిన వ్యక్తుల్లో డల్లాస్ కు చెందిన 21 ఏళ్ల పాట్రిక్ క్రూసియస్ గా పోలీసులు గుర్తించారు.  మిగతా వారిని కూడా విచారిస్తున్నారు.  ఎల్ పాసో మెక్సికో సరిహద్దుల్లో ఉండటంతో మరిన్ని అనుమానాలకు తెరతీసింది.