సీరం ఇన్స్టిట్యూట్ కు డిసిజిఐ అనుమతి...

సీరం ఇన్స్టిట్యూట్ కు డిసిజిఐ అనుమతి...

ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సిన్ పై తిరిగి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  దీంతో అక్కడ ట్రయల్స్ మొదలయ్యాయి.  ఆక్స్ ఫర్డ్ తో కలిసి ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ఈ వాక్సిన్ ను డెవలప్ చేస్తున్న సంగతి తెలిసిందే.  సీరం ఇన్స్టిట్యూట్ ఇప్పటికే ఈ వాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  అయితే, ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ ను నిలిపివేయడంతో ఇండియాలోనూ ట్రయల్స్ కు అంతరాయం ఏర్పడింది.  మరింత లోతుగా పరిశీలించిన ఆక్స్ ఫర్డ్ బ్రిటన్ లో తిరిగి ట్రయల్స్ ను మొదలుపెట్టింది.  దీంతో ఇండియాలోనూ ట్రయల్స్ కు తిరిగి అనుమతి ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ సంస్థ డిసిజీఐ ను కోరింది.  డిసిజీఐ కు వాక్సిన్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందివ్వడంతో ట్రయల్స్ కు తిరిగి అనుమతి ఇచ్చింది.  దీంతో ఇండియాలో ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.