అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య

అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి భార్య దయాలు అమ్మాళ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అపోలో ఆసుపత్రి వర్గాలు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారంను తెలపలేదు. గత మూడు సంవత్సరాలుగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నఆమెను బెంగళూరు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆమె అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్లు 2015 లో వైద్యులు గుర్తించారు. దయాలు అమ్మాళ్.. కరుణానిధిని 12 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు.