'ఆ' పనివల్లే నా భర్తకు గాయం : వార్నర్ భార్య

'ఆ' పనివల్లే నా భర్తకు గాయం : వార్నర్ భార్య

భారత జట్టు పై వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే ఆ ఆ రెండు వన్డేల్లో అర్ధశతకాలు సాధించిన ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే వార్నర్ స్ట్రెయిన్ ఇంజ్యూరీపై అతని భార్య క్యాండిస్ వార్నర్ బోల్డ్ కామెంట్స్ చేసింది. మేము ఐపీఎల్ కారణంగా 4 నెలల తర్వాత కలిసాము. కాబట్టి ఈ మ్యాచ్‌కు ముందు మేము లైంగికంగా కలుసుకున్నాము. ఆ కారణంగానే అతనికి గాయమైందని ఓ రేడియో షోలో సరదాగా చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలకు ఆ రేడియో హోస్ట్ స్పందిస్తూ.. ‘నీ వల్లే వార్నర్‌కు గాయమైంది. నువ్వు క్రికెట్ ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం చేశావ్' అని నవ్వుతూ అన్నాడు. దానికి క్యాండిస్ మళ్ళీ సరదాగా సారీ ఆస్ట్రేలియా అంటూ బదులిచ్చింది. అయితే తాజాగా వార్నర్ కు నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా అతను డిసెంబర్ 17 న ఈ రెండు జట్ల మధ్య జరగనున్న డే-నైట్ మ్యాచ్ లో ఆడటం కూడా అనుమానమే అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు.