ఐపీఎల్ 2020 : సన్ రైజర్స్ బోణి కొడుతుందా...?

ఐపీఎల్ 2020 : సన్ రైజర్స్ బోణి కొడుతుందా...?

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. అయితే సన్ రైజర్స్ తమ మొదటి మ్యాచ్ లో బెంగళూరు తలపడగా ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కానీ తర్వాత సన్‌రైజర్స్ 153 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ గాయపడగా ఈ రోజు మ్యాచ్ లోకి అతని స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వస్తున్నాడు. అయితే హోల్డర్ వంటి స్టార్ ఆల్ రౌండర్ జట్టులోకి రావడంతో సన్ రైజర్స్ బలం పెరిగింది అనే చెప్పాలి.

ఇక నైట్ రైడర్స్ తమ మొదటి మ్యాచ్ ముంబై తో ఆడింది. అందులో ముంబై జట్టు నిర్ణిత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తర్వాత 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కేకేఆర్ జట్టు ముంబై బౌలర్లను తట్టుకోలేక 146 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ముంబై 49 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అందువల్ల ఈ రోజు ఆడుతున్న ఈ రెండు జట్లు తాము ఆడిన మొదటి మ్యాచ్ లో ఓడిపోవడంతో రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తునాయి. అయితే ఈ రెండు జట్లు మొదటి మ్యాచ్ లో లక్ష్య చేధనలోనే ఓడిపోయాయి. మరి ఈ రోజు ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు.. ఎవరు లక్ష్య చేధన చేస్తారు.. ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.