ఆ మ్యాచ్ లో అభిమానులను చూడాలనుకుంటున్న సన్ రైజర్స్ కెప్టెన్...

ఆ మ్యాచ్ లో అభిమానులను చూడాలనుకుంటున్న సన్ రైజర్స్ కెప్టెన్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇన్ని రోజులు ఇంగ్లాండ్ తో వన్డే, టీ 20 సిరీస్ లు బయో సేఫ్టీ బబుల్ లోనే ఉండి ఆడాడు. అందువల్ల బయో బబుల్ లో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకున్న అతను ఐపీఎల్ 2020 లో ఆటగాళ్ళు తమ మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవాలని సూచించాడు. యూఏఈ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్‌ నిన్న ప్రారంభమైంది. కొనసాగుతున్న కరోనా నియమాల కారణంగా ఈ లీగ్ లో ఆడే ఆటగాళ్లకు అలాగే సహాయక సిబ్బందికి ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఐపీఎల్ కోసం తాజాగా దుబాయ్ చేరుకున్న వార్నర్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఐపీఎల్ లో ఆటగాళ్లు ముఖ్యంగా తమ మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవాలని కోరాడు. అలాగే అభిమానులు లేకుండా ఆడటం వింతగా అనిపించింది. ఇప్పుడు నేను దానికి అలవాటు పడ్డాను. కానీ ఈ లీగ్ తర్వాత జరగబోయే భారత్-ఆస్ట్రేలియా సిరీస్ సమయానికైనా కనీసం 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించవచ్చని నేను ఆశిస్తున్నాను. డిసెంబర్ లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ మొదటి మ్యాచ్ లో అభిమానులను చూడాలనుకుంటున్నాను అని వార్నర్ అన్నాడు.