'నిశ్శబ్దం' ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ చేసారా..?

'నిశ్శబ్దం' ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ చేసారా..?

ప్రస్తుతం టాలీవుడ్  లో ఉన్న సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిశ్శబ్దం. దీనికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించగా మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే నాని నటించిన 'వి' సినిమా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ కారణంగానే ఈ సినిమా ఓటీటీ విడుదలకు ప్లాన్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేశారట! ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 2న ఓటీటీలో  విడుదల కానున్నట్లు సమాచారం. మొత్తం 5 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీ లో విడుదలైన పెంగ్విన్, వి సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.