టీడీపీకి నష్టం చేసేందుకే ఈ కుట్ర..!

టీడీపీకి నష్టం చేసేందుకే ఈ కుట్ర..!

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ, తెలంగాణ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు, మంత్రి కళా వెంకట్రావ్... డేటా చోరీపై మంత్రులతో కలిసి గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కుట్రతో తెలంగాణా అధికారులతో కుమ్మక్కై ఐటీ కార్యాలయంలో రైడ్ చేసి కొంత మెటీరియల్ తీసుకెళ్లారని ఆరోపించారు. టీడీపీకి నష్టం చేయాలనే ఉద్దేశంతో మెటీరియల్ ని వైసీపీకి ఇచ్చారని.. దానిపై గుంటూరు రూరల్  ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. టీడీపీ యాప్, ఐటీ గ్రిడ్ పై దాడి కేసి డేటాను తస్కరించి వైసీపీకి ఇచ్చారని.. సీజ్ చేసిన డేటాపై ఎలాంటి నివేదిక రాయక పోవడం ఒక తప్పన్నారు కళా వెంకట్రావు. సేవా మిత్ర సమాచారంతో ఓట్లను తొలగిస్తున్న విధానం వైసీపీ కుట్రలో భాగమేనని ఆరోపించిన ఆయన.. అన్నీ వివరాలు ఎస్పీకి ఇచ్చాం.. ఫిర్యాదుతో ధర్యాప్తు చేస్తే కుట్రదారులు బయటకు వస్తారు.. కుట్రకు కారకులైనవారి పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు తెలిపారు.