ఐపీఎల్ లో కూడా జాతివివక్షత ఉంది : డారెన్ సమీ

ఐపీఎల్ లో కూడా జాతివివక్షత ఉంది : డారెన్ సమీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పుడు తాను జాత్యహంకారానికి గురయ్యానని రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ చెప్పాడు. "నేను ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడినప్పుడు ఆవారు నన్ను మరియు శ్రీలంక మాజీ కెప్టెన్ తిసారా పెరెరాను వేరే పేరుతో పిలిచేవారు. అయితే ఆ పేరు అర్థం ఏమిటో నేను నేర్చుకున్నాను. వారు నన్ను మరియు పెరెరాను నల్లజాతి వ్యక్తి అనే పేరుతో పిలిచారు సమీ అని తెలిపాడు. అయితే సమీ మరియు మరో వెస్ట్ ఇండియన్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా క్రీడలో వివక్షను ఎదుర్కోవడాన్ని తెలిపాడు, జాత్యహంకారం కేవలం ఫుట్‌బాల్‌కు మాత్రమే పరిమితం కాదు, క్రికెట్‌లో కూడా ప్రబలంగా ఉంది అని తెలిపాడు. నలుపు శక్తివంతమైనది. నేను నల్లజాతి వ్యక్తి అయినందుకు గర్వంగా ఉంది" అని గేల్ తెలిపాడు.