దర్బార్:  ఎన్నాళ్ళో వేచిన హృదయం... ఈనాడే నిజమౌతుంటే... 

దర్బార్:  ఎన్నాళ్ళో వేచిన హృదయం... ఈనాడే నిజమౌతుంటే... 

రజినీకాంత్ ఓ మంచి సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.  ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఫలితం ఇప్పటికి వచ్చింది.  ఈ సినిమా విషయంలో రజినీకాంత్ తీసుకున్న శ్రద్ధ, మురుగదాస్ స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అయ్యాయి.  దాదాపుగా పదేళ్లుగా మంచి హిట్ కోసం రజిని అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఈ మధ్యకాలంలో వచ్చిన రజిని సినిమాలు యావరేజ్ గా నిలుస్తున్నాయి. యావరేజ్ సినిమాలు అయినప్పటికీ వసూళ్ల పరంగా మంచి హిట్ అందుకున్నాయి. 

కానీ, ఇప్పుడు ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంతో అభిమాలను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  రజినీకాంత్ యాక్షన్ తో మాయ చేశాడు.  ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ యాంగిల్, సెకండ్ హాఫ్ లో యాక్షన్ తో అదిరిపోయిందట.  సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మరో వారం రోజులపాటు టికెట్స్ దొరకడం కష్టం అంటున్నారు.