కుమ్మేసిన దర్బార్... ఫస్ట్ డే ఎంత అంటే... 

కుమ్మేసిన దర్బార్... ఫస్ట్ డే ఎంత అంటే... 

దర్బార్ సినిమా జనవరి 9 న రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నది.  ఈ సినిమాపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నది.  ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి.  మొదటి రోజు కలెక్షన్లపై దృష్టి పెట్టిన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  

దేశంలో మిగతా ప్రాంతాలతో కలిసి దాదాపుగా ఈ సినిమా రూ. 40 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోని మిగతా చోట్ల నుంచి ఇంకా రిపోర్ట్స్ అందాల్సి ఉన్నది.  మొత్తం మీద మొదటి రోజున దాదాపుగా దర్బార్ రూ. 60 కోట్ల వరకు వసూళ్లు సాధించి ఉండొచ్చని అంటున్నారు.