కోలీవుడ్ లో దర్బార్ ఫీవర్ మొదలైంది... 

కోలీవుడ్ లో దర్బార్ ఫీవర్ మొదలైంది... 

రజినీకాంత్ దర్బార్ సినిమా జనవరి 9 న రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  చాలాకాలం తరువాత రజినీకాంత్ మరలా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆదిత్య అరుణాచలం పేరుతో రజినీకాంత్ చేసే హంగామా మాములుగా ఉండదు అని అంటున్నారు.  ఇప్పటికే కోలీవుడ్ లో రజిని ఫీవర్ మొదలైంది.  

థియేటర్స్ 9 వ తేదీ కోసం ముస్తాబవుతున్నాయి.  దేశవ్యాప్తంగా రజిని మానియాతో ఊగిపోతున్నది.  మురుగదాస్ ఈ సినిమా పక్కా యాక్షన్ వే తీసినట్టుగా తెలుస్తోంది.  అత్యాచార ఘటన సినిమా హైలైట్ కానున్నది.  దీనిని చాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఎలా పరిష్కరించారు అన్నది కథ.  ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుంది.  మరి రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.