వారి ఉన్నత విద్య బాధ్యత మాదే..

వారి ఉన్నత విద్య బాధ్యత మాదే..

దళితుల ఆకాంక్షలకు అనుగుణంగా అణగారిన కుటుంబాలకు చేయుతనందిస్తున్నది తమ ప్రభుత్వమేనని ఏపీ మంత్రి ఆనంద్‌బాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు మూడు లక్షల మందికి ఉపాధి కల్పించామని ఆయన గుర్తుచేశారు. దళితవాడల అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు సైతం అభినందిస్తున్నారని ఆనంద్‌బాబు చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. దళిత విద్యార్థలు విదేశాల్లో చదువుకోవాలనుకున్నా, దేశీయంగా ఉన్నత చదువుల కోసమైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు.