దారుణం.. జీతం అడిగాడని సజీవ దహనం చేశారు..!

దారుణం.. జీతం అడిగాడని సజీవ దహనం చేశారు..!

జీతం అడిగిన ఉద్యోగిని ఓ మద్యం కాంట్రాక్టర్ దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది... పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్వార్‌లోని కంపూర్ గ్రామంలో ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్న కాంట్రాక్టర్లను నిలదీశాడు కమల్‌ కిషోర్‌ అనే యువకుడు.. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కాంట్రాక్టర్లు దారుణంగా హత్య చేశాడు.

రాకేష్‌ యాదవ్, సుభాష్ చంద్‌ అనే మద్యం కాంట్రాక్టర్ల దగ్గర.. కమల్ కిషోర్‌ పనిచేస్తున్నాడు.. అయితే, గత ఐదు నెలలుగా జీతం ఇవ్వడంలేదు. జీతం ఇవ్వాలని కమల్‌ కిషోర్‌ అడగ్గా.. అతడిని కొట్టి బెదిరించి కాంట్రాక్టర్లు.. తమ వెంట తీసుకెళ్లారు. కమల్ రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు.. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు కుంపూర్ మద్యం కంటైనర్లో మంటలు చెలరేగినట్లు గుర్తించిన పోలీసులు.. దానిని తెరిచి చూడగా కాలిపోయిన కమల్‌ శరీరం కనిపించింది. కాంట్రాక్లర్లు ఇద్దరు కమల్‌ను కంటైనర్‌లో వేసి సజీవదహనం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు మేరకు సదరు కాంట్రాక్టర్లపై హత్య, ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.