మార్చి 4, గురువారం దినఫలాలు

మార్చి 4, గురువారం దినఫలాలు

​మేషం..
ఈ రోజు మీరు టెక్నాలజీ ఉపయోగించి వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశముంది. అంతేకాకుండా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుడి మాటల వల్ల మనస్సు కలత చెందుతుంది. స్వభావరీత్యా ఈ రోజు కొంచెం చిరాకు ఉండవచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించండి. మీ పనిపై దృష్టి పెట్టండి. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి శుభ కార్యాలకు వెళ్లే అవకాశముంది. 

​వృషభం..

స్నేహితులు మరియ సోదరుల సహాయంతో ఈ రోజు పెద్ద అధికారి సాయం పొందవచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆనందం, సంపద విస్తరిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దవారి నుంచి డబ్బు పొందే అవకాశముంది. కుటుంబ ఖర్చులను నియంత్రించాలి. సాయంత్రం సమంయంలో వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. సంయనంతో ఉండండి. లేకుంటే సంబంధాలు తెగిపోయే అవకాశముంది. 

​మిథునం..

ఈ రోజు విద్యార్థులు తమ సమయాన్ని బాగ ఉపయోగించుకుంటారు. ఉద్యోగం మార్చాలని చూస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. అత్తవారి వైపు నుంచి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. పనిప్రదేశంలో మీపై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటుంది. పదోన్నతులు సాధించే అవకాశముంది. సంతానం నుంచి శుభవార్తలు పొందుతారు. పెట్టుబడులు ప్రయోజనాన్ని ఇస్తాయి. ముఖ్య పత్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. 

​కర్కాటకం..

కుటుంబంలో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వాములు, సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే మీ సౌకర్యాన్ని త్యాగం చేయాలి. సంతానం కెరీర్లో పురోగతి సాధిస్తారు. ఫలితంగా మీ ఆనందం పెరుగుతుంది. ఎక్కడి నుంచైనా డబ్బు పొందే అవకాశముంది. మీ మానసిక ఆందోళన అంతమవుతుంది. విద్యార్థులు చదవేందుకు ఆసక్తి చూపుతారు. 

​సింహం..

వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. స్నేహితులు, సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీరు తీరిక లేకుండా ఉండాల్సి ఉంటుంది. పనిప్రదేశంలో మీ ఆదాయం పెరుగుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. బయట ఆహారాన్ని నియంత్రించండి. లేకపోతే కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది.

​కన్య..

చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. ఇదే సమయంలో విద్యార్థులు ఆర్థిక సహాయం పొందే అవకాశముంది. పనిప్రదేశంలో ఈ రోజు మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సంతాన ఉన్నత విద్య లేదా పరిశోధనల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పాత శత్రుత్వం సోదరుల సహాయంతో ముగుస్తుంది. 

​తుల..

తులా రాశి వారికి తండ్రి మార్గదర్శకత్వంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆభరణాలతో సంబంధమున్న వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. పనిప్రదేశంలో మీకు అసౌకర్యంగా ఉంటుంది. ప్రణాళిక లేని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కొంత సమయంలో సమాజానికి కేటాయిస్తారు.

​వృశ్చికం..

విద్యార్థులు ఆచారణాత్మక ఆలోచనలో పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా అనుభవాల సహాయంతో వారు పోటీ పరీక్షలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. సామాజిక ఖ్యాతి విస్తరిస్తుంది. నిరుద్యోగ యువత కోసం అన్వేషణ పూర్తవుతుంది. తల్లి ఆశీర్వాదాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం మేధోపరమైన అనుకూల ఫలితాలతో కీర్తి పెరుగుతుంది. సాయంత్రం సమయంలో ఆస్తి నుంచి కొంత ఆదాయం పొందుతారు. పెద్ద వ్యక్తుల సహాయంతో ఆగిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. 

​ధనస్సు..

పనిప్రదేశంలో మార్పు కారణంగా మీ పని తీరు కూడా మెరుగుపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. విదేశాల్లో పనిచేసే స్థానికులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లభిస్తుంది. మీ ప్రవర్తనపై నిగ్రహం లేకపోతే సైద్ధాంతిక తేడాలు తలెత్తవచ్చు. ఈ కారణంగా ఏదైనా ఆస్తితో కుటుంబంలో వివాహం తలెత్తుతుంది. సాయంత్రం సమయంలో దగ్గరి ప్రయాణాలు చేసే అవకాశముంది. రాబోయే రోజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

​మకరం..

రాజకీయాలకు సంబంధించి ప్రజల ప్రభావం విస్తరిస్తుంది. ఉద్యోగార్థులు నూతన పనిని వివరిస్తారు. పని ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యక్తుల ఆదాయం కూడా పెరుగుతుంది. కోపానికి దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక లాభాలతో మీ కీర్తి పెరుగుతుంది. మీరు శత్రువుల నుంచి స్వేచ్ఛ పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి విజయాన్ని పొందుతారు.

​కుంభం..

పనిప్రదేశంలో వేరొకరి కారణంగా పని మరింత దిగజారవచ్చు. అధికారులు మీపై ఆగ్రహం వ్యకం చేయవచ్చు. సహోద్యోగుల మద్దతు కొనసాగుతుంది. ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమవడం పెరుగుతుంది. సామాజిక సంస్థలో చేరడం ద్వారా ప్రజలకు సహాయం చేస్తారు. వ్యాపారస్తులకు సంపద విస్తరిస్తుంది. జీవిత భాగస్వామితో సైద్ధాంతి విభేదాలు తలెత్తవచ్చు. కోపాన్ని నియంత్రించండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం లేదా ధార్మిక సందర్శన ఉండవచ్చు.

​మీనం..

చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసం పెరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఈ రోజు కొంత మంది సన్నిహితులు, బంధువులు మీ వద్దకు రావచ్చు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. శుభవార్త అందుకుంటాయని భావిస్తున్నారు. రాజకీయాల్లో పెరిగిన ప్రజాసంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ రోజు మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.