ఐపీఎల్‌ :సీఎస్‌కే బోణీ..అదరగొట్టిన రాయుడు.!

ఐపీఎల్‌ :సీఎస్‌కే బోణీ..అదరగొట్టిన రాయుడు.!

ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యింది. అబూధాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ లో  ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్ పై విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్ తో జోడిగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (12) నిరాశపరచగా... డికాక్ (33), సౌరభ్ తివారీ (42) పరుగులు తీశారు. మొదట ముంబై దూకుడు ప్రదర్శించినప్పటికీ దానిని చివరివరకు కొనసాగించలేకపోయింది. కాగా 163 పరుగుల   లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తరవాత వచ్చిన డుప్లెసిస్, అంబటి రాయుడు కలిసి మంచి ఆటతీరు కనబర్చారు. డుప్లెసిస్ 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేయగా... రాయుడు 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత చెన్నై మరో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.