ప్లే ఆఫ్స్ కు కీలకమైన మ్యాచ్ లో తలపడనున్న రాజస్థాన్, చెన్నై 

ప్లే ఆఫ్స్ కు కీలకమైన మ్యాచ్ లో తలపడనున్న రాజస్థాన్, చెన్నై 

ఐపీఎల్ 2020 పాయింట్ల టేబుల్ లో స్థానాలు ఒక్క మ్యాచ్ తోనే తారుమారు అవుతున్నాయి. ఏ మ్యాచ్ ఓడిన టేబుల్ లో కిందకు రావడం ఖాయం. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు మొదలు కావడంతో ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. అయితే ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ తలపడనున్నాయి.  ఐపీఎల్ లో మూడు సార్లు కప్ అందుకున్న చెన్నై ఈ సీజన్ లో మాత్రం దారుణంగా ఆడుతుంది. ఆడిన 9 మ్యాచ్ లలో 6 ఓడిపోయి పాయింట్ల టేబుల్ లో  7వ స్థానంలో ఉంది. విజయాల కోసం చాలా కష్టపడుతున్న చెన్నై జట్టు బ్యాటింగ్ లో మెరుపులు కనిపించడం లేదు. షేన్ వాట్సన్, డుప్లెసిస్ తప్ప బ్యాటింగ్ లో రాణించేవారు లేరు. జట్టులో రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. జడేజా బ్యాట్ తో పరుగులు చేస్తున్న కెప్టెన్ కూల్ మాత్రం చాలా దారుణంగా విఫలమవుతున్నాడు.  

ఇక రాజస్థాన్ పరిస్థితి కూడా అంతే. ఆడిన 9 మ్యాచ్ లలో 6 ఓడిపోయి పాయింట్ల టేబుల్ లో  8వ స్థానంలో ఉన్న రాయల్స్ లో బ్యాటింగ్ సరిగా లేదు. మొదటి రెండు మ్యాచ్ లు ఆడిన స్మిత్, సంజు సామ్సన్ తర్వాత డీలా పడిపోయారు. ఇక బౌలింగ్ లో కూడా ఆర్చర్ కు తోడుగా మరొకరు లేరు. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య  22 మ్యాచ్ లు జరగా అందులో 14 చెన్నై గెలిస్తే 8 రాజస్థాన్ విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చూడాలి మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది.