ఐపీఎల్ 2020 : చెన్నై చరిత్ర ఘనం... ప్రస్తుత్తం శూన్యం

ఐపీఎల్ 2020 : చెన్నై చరిత్ర ఘనం... ప్రస్తుత్తం శూన్యం

ఐపీఎల్ 2020 లో చెన్నై దాదాపు ఇంటికి చేరుకున్నట్లే... ఐపీఎల్ ప్రతి సీజన్ లో ఫైనల్స్ లేదా సెమీస్ కు చేరుకున్న చెన్నై ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్ రేస్ లో కూడా లేదు. ఈ సీజన్ లో మరో 4 మ్యాచ్ లు ఆడాల్సిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే తప్పకుండ గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ లో బలమైన జట్లలో ఒక్కటిగా ఉండే చెన్నై జట్టు ఈ ఏడాది మాత్రం చెత్త జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు 8 సార్లు ఫైనల్ కు చేరిన ధోనిసేన మూడు సార్లు టైటిల్ అందుకుంది. అందుకే లీగ్ ఆరంభానికి ముందు అన్ని జట్లు ప్లే ఆఫ్ లక్ష్యంగా పెట్టుకుంటే చెన్నై లక్ష్యం మాత్రం ఫైనల్.. అలా ఉండేది పరిస్థితి. అందుకే మాజీలు  కూడా ఫైనల్ లో చెన్నై బెర్త్ ను ఫిక్స్ చేసి.. ఆ జట్టుతో పొట్టి పడే మరో జట్టు గురించి మాట్లాడుకునేవారు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి మారిపోయింది. జట్టులో కావలసినంత అనుభవం ఉన్న దూకుడుగా ఆడే ఆటగాళ్లకు లేరు. ఈ ఐపీఎల్ లో ధోని, జాదవ్ లో టెస్ట్ బ్యాటింగ్ జట్టును ముంచుతుంది. ముఖ్యంగా ఈ జట్టులో గెలవాలనే కసి కనిపించడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.