ఐపీఎల్ 2020 కి బ్రావో పూర్తిగా దూరం...

ఐపీఎల్ 2020 కి బ్రావో పూర్తిగా దూరం...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ఆటగాడు డ్వేన్‌‌ బ్రావో ఈ ఏడాది ఐపీఎల్ కు పూర్తిగా దూరం అవుతున్నాడు. ఇంతకముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బ్రావో చివరి ఓవర్ బౌల్ చేయకుండానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అతను ఆడలేదు. ఇక ఆ మ్యాచ్ టాస్ సమయంలో ''బ్రావో తరువాతి కొన్ని ఆటలకు అందుబాటులో ఉండడు'' అని ధోని తెలిపాడు. కానీ తాజాగా చెన్నై సీఈఓ.. బ్రావో ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతున్నాడు అని తెలిపాడు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో 10 మ్యాచ్ లు ఆడిన చెన్నై అందులో కేవలం మూడు మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది. ఇంకా ఈ జట్టు ఆడాల్సిన మ్యాచ్ లు నాలుగు ఉన్నాయి.  అయితే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ లో నుండి ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే ఆ జట్టు కీలక ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టు నుండి తప్పుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడంతో గత ఏడాది కంటే బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను చెన్నై కొంచెం వెనుకపడిపోయింది.