ఐపీఎల్ 2020: ధోనీ మరో అరుదైన ఘనత..

ఐపీఎల్  2020: ధోనీ మరో అరుదైన ఘనత..

మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో 200 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న తొలి ఆటగాడిగా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ఈ ఘనతతో మరో రికార్డును ధోని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 200 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచిన తన తాజా మైలురాయి గురించి ఎంఎస్ ధోని మాట్లాడుతూ... చాలా గాయాలు లేకుండా 13 సంవత్సరాల పాటు ఆడటం తన అదృష్టమని ధోని పేర్కొన్నాడు.
ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గాయం కారణంగా బ్రావో "కొన్ని మ్యాచ్‌లకు" దూరంగా ఉంటాడని ధోని వెల్లడించాడు. ఈ గాయాలు ఇతర ఫ్రాంచైజీలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని, కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆటగాళ్ళు ఎక్కువ రోజులు ఆడకపోవడం ఈ సమస్యకు ఒక కారణమని అన్నారు. ఇక బ్రావో తరువాతి కొన్ని ఆటలకు అందుబాటులో ఉండడు అని స్పష్టం చేసాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో ఏడవ ర్యాంక్ లో ఉన్న చెన్నై ప్లే-ఆఫ్ దశకు చేరుకోవలి అంటే వారు మిగిలిన మ్యాచ్‌లను గెలవడం తప్పనిసరి.