సంజు కోసం చెన్నై-బెంగళూరు పోటీ...

సంజు కోసం చెన్నై-బెంగళూరు పోటీ...

ఐపీఎల్ 2021 కి వేలం నిర్వహించాల్సిన సమయం దగ్గర పడటంతో గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. అయితే ఈ విషయం పై ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి ప్రయత్నించాయని నా దృష్టికి వచ్చింది. ఈ రెండు ఫ్రాంచైజీలు సంప్రదించిన తరువాతే రాజస్థాన్ రాయల్స్ కూడా సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకోవడమే కాకుండా జట్టులో అతని స్థాయిని పెంచాలని భావించింది. అందుకే శాంసన్‌ను తమ సారథిగా ప్రకటించింది. అయితే స్టీవ్ స్మిత్ ‌ను వదులుకొని రాజస్థాన్ రాయల్స్ మంచి పనిచేసింది. అతనికి రూ.12.5 కోట్లు దండుగ. తాజా వేలంలో అతని కోసం ఇంతకంటే ఎక్కువ వెచ్చిస్తే అంతకంటే పిచ్చి పని మరేది ఉండదు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు. మరి ఈ ఏడాది ఐపీఎల్ లో సంజు తన కెప్టెన్సీ భాధ్యతలు ఎలా నిర్వహిస్తాడు అనేది చూడాలి.