స్మిత్ కోసం పోటీ పడుతున్న కోహ్లీ, ధోని జట్లు

స్మిత్ కోసం పోటీ పడుతున్న కోహ్లీ, ధోని జట్లు

ఐపీఎల్ 2020 విజయవంతం అయిన తర్వాత ఐపీఎల్ 2021 పై దృష్టి పెట్టింది బీసీసీఐ. అయితే ఇందుకోసం వచ్చే ఏడాది ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించాలని నిర్ణయిచుకుంది. ఆ కారణంగానే  గత బుధవారం అన్ని ఐపీఎల్ జట్లు తమ వెంటవుంచుకునే ఆటగాళ్ల జాబితను, అలాగే వదిలిపెట్టే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసాయి. ఇక గత ఏడాది ఐపీఎల్ లో చివరి స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తమ జట్టు కెప్టెన్ అలాగే స్టార్ ఆటగాడు అయిన స్టీవ్ స్మిత్ ను వదిలిపెట్టింది. దాంతో స్మిత్ కోసం పోటీ పెరిగింది. ముఖ్యంగా ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ ను తమ జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ న్యాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న.. వీటికి ఒకే రకమైన సమస్య ఉంది. అదేంటంటే ఏ జట్టులో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైన్ అప్ లేదు. దాంతో స్మిత్ ను తీసుకొని 4వ స్థానంలో అతడిని బ్యాటింగ్ కు పంపించాలని ఆలోచనలో ఉన్నాయి. అయితే వేలంలో ఆటగాడిని కొనడానికి కావాల్సిన డబ్బు ఈ రెండు జట్ల కంటే మూడు రేట్లు ఎక్కువగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద ఉంది. దాంతో ఆ జట్టు వేలంలో స్మిత్ ను సత్యధిక ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.