దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో ఏడుగురికి కరోనా...

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో ఏడుగురికి కరోనా...

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాల దేశాలతో పాటుగా దక్షిణాఫ్రికా కూడా లాక్ డౌన్ విధించింది. ఈ వైరస్ కారణంగా అక్కడ అని క్రీడాకార్యక్రమాలతో పాటుగా క్రికెట్ మ్యాచ్లు కూడా రద్దుచేసింది. దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ బోర్డు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు కారణంగా మళ్ళీ ఆటగాళ్లకు ట్రైనింగ్ ప్రారంభించాలని చూస్తుంది. అందుకోసం వారితో ఉండాల్సిన కొంతమంది సిబ్బందికి మరియు కొంతమంది కాంట్రాక్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మొత్తం 100 మందికి కరోనా పరీక్షలను నిర్వహించింది. అయితే అందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది అని బోర్డు సీఈఓ జాక్వెస్ ఫాల్ తెలిపారు. జాక్వెస్ మాట్లాడుతూ... "మేము 100 మందికి పరీక్షలు నిర్వహించం అందులో ఏడుగురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది, వాస్తవానికి వందలో ఏడు చాలా తక్కువ" అని చెప్పారు. దాంతో దక్షిణాఫ్రికా బోర్డు జూన్ 27 న స్థానికంగా ప్రారంభించాలనుకున్న టోర్నమెంట్ ను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.