సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళనకు ఏపీ సర్కార్ కార్యాచరణ

సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళనకు ఏపీ సర్కార్  కార్యాచరణ

సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల దుర్వినియోగం జరగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను నియంత్రించేలా ప్రణాళికలు రెడీ చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్స ఖర్చుల రీఇంబర్స్మెంట్ దరఖాస్తులను స్వీకరించొద్దని ప్రజాప్రతినిధులకు సీఎం కార్యాలయం సూచనలు చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2434 జబ్బులకు చికిత్స అందిస్తున్నట్లు సీఎంఆర్ఎఫ్ ఇంచార్జి డాక్టర్ హరికృష్ణ స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ తరహా క్లెయిములు సీఎం సహాయనిధి కింద స్వీకరించ బోమని స్పష్టీకరణ చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని సీఎంఓ పేర్కొంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని సీఎంఆర్ఎఫ్ క్లైములు దరఖాస్తులు ప్రజా ప్రతినిధుల పీఏలు మాత్రమే పంపాలని సీఎంఓ కోరింది.