కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు వృథా...

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు వృథా...

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసందే. అందువల్ల దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది భారత ప్రభుత్వం. అందువల్ల చాల కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే లాక్ డౌన్ సమయం లో ప్రజలకు అత్యవసరమైన నిత్యావసర సరుకుల దుకాణాలు తప్ప మిగితా అని మూసేయాలని ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. అందువల్ల సినిమా థియేటర్లు, వైన్ షాపులు అని లాక్ డౌన్ ముగిసే అంతవరకు మూసేయాల్సిందే. అందువల్ల మన తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు వృథా అవుతుందని సమాచారం. ఎందుకంటే... నిబంధలన ప్రకారం బీరు తయారీ సమయం వద్ద నుండి కేవలం ఆరు నెలల గడువు వరకు మాత్రమే వాడుకోవచ్చు. ఆ సమయం దాటినా తరువాత అమ్మడం కుదరదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, వైన్ షాపులో సుమారు 20 లక్షల పెట్టెల బీరు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆ బీర్లు తాగడానికి ఇంకా ఎక్కువ రోజులు పనికిరావు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ లాక్ డౌన్ ఇప్పుడప్పుడే ముగిసేటట్లు కనిపించడం లేదు. అందువల్ల  20 లక్షల పెట్టెల బీరు అంటే కోటిన్నర లీటర్ల బీరు వృథా అవనున్నట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.