హైదరాబాద్ మజీద్ లో మలేషియన్ జమాతే కార్యకర్తలు..ఏడుగురిపై కేసు!

 హైదరాబాద్ మజీద్ లో మలేషియన్ జమాతే కార్యకర్తలు..ఏడుగురిపై కేసు!

మలేషియా నుండి వచ్చి ఢిల్లీ ప్రార్థనలకు హాజరై హైదరాబాద్ మజీద్ లో ఉంటున్న జమాతి కార్యకర్తలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మలేషియాకు చెందిన హమీద్‌బిన్‌ జేహెచ్‌ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్‌ అల్‌ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్‌ జమాన్‌ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్‌ బాన్‌ అబ్దుల్‌ రహీం, జైనారియా లు టూరిస్ట్ వీసా పై ఢిల్లీ లో జరిగిన మత ప్రార్థనకు హాజరయ్యారు. ఆ తరువాత మలేషియా వెళ్లాలనుకుంటే లాక్ డౌన్ తో రవాణా నిలిచిపోయింది. దాంతో నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ ఆరుగురు హకీంపేట్ లోని మజీద్ లో ఆశ్రయం పొందారు. మజీద్ ఇంఛార్జ్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికీ ఆశ్రయం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి  క్వారంటైన్ కు తరలించారు. ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసారు.