తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఇదేనా...!
రెండు నెలలుగా అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో.. క్రైం రేట్ దాదాపు జీరోకు చేరింది. అందరూ ఇళ్లకే పరిమితమవడం, రోడ్లపైకి రాకుండా కఠిన నిబంధనలు అమలు కావడంతో.. నేరాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులతో.. జనం రోడ్లపైకి వస్తున్నారు. మద్యం విక్రయాలు కూడా మామాలుగా సాగుతున్నాయి. దీంతో నేరస్తులు కూడా జూలు విదుల్చుతున్నారు. ఈపరిణామాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి.
లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక పోలీసులంతా...రోడ్డుమీద డ్యూటీలకే పరిమితమయ్యారు. ఏ హడావుడి జరిగినా...ఎలాంటి అత్యవసరసమయాలు వచ్చినా..పోలీసు కేసులు మాత్రం ఆగేవి కావు . నేరాలు జరుగుతూనే ఉండేవి. కానీ మొట్టమొదటిసారి..కరోనా వైరస్ విజృంబించాక..నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు . దీంతో దాదాపు రెండునెలలుగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పోలీసులు కూడా...హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతకాలం క్రైమ్ అసలు జరగకపోవడం సంతోషం కలిగించినా...మద్యం షాపులు ఓపెన్ అయిన రోజు నుంచీ...మళ్లీ క్రైమ్ స్టార్ట్ అయింది . ఫుల్‌గా మద్యం తాగి కొందరు భార్యలపై దాడులు చేస్తుంటే...చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న పాతకక్షలు సైతం రోడ్డెక్కేసాయి . ఇక డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్లు కూడా రీస్టార్ట్ అయ్యాయి .
ఇక..రోడ్లపై ట్రాఫిక్ మూమెంట్ స్టార్ట్ అవడంతో..చైన్‌స్నాచర్లు , బైక్ దొంగలు కూడా తమ చేతివాటానికి పనిపెడుతున్నారు . ఇక హత్యలు , ఆత్మహత్యలు , అత్యాచారాల కేసులు కూడా స్టార్ట్ అయిపోయాయి. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండీ హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడం ప్రమాదాలు జరక్కపోడానికి ఓ కారణమైతే...మద్యం షాపులు మూసివేసి ఉండటం కూడా మరోకారణంగా తేల్చారు పోలీసులు. మద్యం షాపులు ఇలా ఓపెన్ అయ్యాయో లేదో...డ్రంకెన్ డ్రైవ్ కేసులు సైతం స్టార్ట్ అయిపోయాయి . హైదరాబాద్ టోలీచౌకీ బ్రిడ్జి సమీపంలో , ఓ కారు డ్రైవర్..ఫుల్‌గా మందేసి..ముందు వెలుతున్న బైక్‌లను డీకొట్టేసాడు. అతగాడిని పట్టుకున్న పోలీసులు...డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ యాక్సిడెంట్‌కు కారణమని తేల్చారు.
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు...జిల్లాల్లో కార్యకలాపాలు, దుకాణాలు యదావిధిగా ప్రారంభం కావడంతో...మూడు రోజుల్లోనే క్రైమ్‌రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది . తాజాగా నమోదు అవుతున్న కేసుల్లో...ఎక్కువ కేసులు డ్రంకెన్ డ్రైవింగ్‌కు సంబందించిన కేసులు కాగా... చాలాకాలంగా రోడ్లపై జనాలు లేకపోవడంతో ...నేరాలకు దూరంగా..ఉన్న వాళ్లంతా మళ్లీ తమ పాత ప్రొఫెషన్‌కు పదునుపెట్టేస్తున్నారు. అంతా ఇళ్లకే పరిమితం అవడంతో ...ఇళ్లల్లో చోరీలు కూడా జరగలేదు..ఎక్కడో ఓ చోట తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరిగాయి . అది కూడా వేల్లపై లెక్కపెట్టే అన్ని కేసులు మాత్రమే . మద్యం షాపులు ఓపెన్ కాగానే...జనం కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేసారు..దీంతో ఎవరికి వారు వాళ్ల పాత ప్రొఫెషన్‌కు పదును పెట్టే పనిలో పడ్డారు.
ఒక వైపు లాక్ డౌన్ మరో వైపు వలస కూలీల తరలింపుఇ ఒత్తిడిలో ఉన్న పోలీసులు ఈ సమస్యని ఎలా పరిస్కరిస్తారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)