స్పిన్నర్ జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి

స్పిన్నర్ జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి

టీమిండియా స్పిన్నర్‌, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. షాపింగ్‌ కోసం జడేజా భార్య రీవా సోలంకి తన కారులో బయల్దేరింది. కారు రాంగ్ రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్ సంజయ్ అహిర్ ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీ కొట్టింది. దెబ్బలు తగిలాయా అని ఆ కానిస్టేబుల్‌ను రీవా అడుగుతున్న క్రమంలోనే.. అతడు ఆగ్రహంతో దాడికి దిగాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకానొక దశలో రీవాను జట్టు పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా.. అడ్డుకున్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో రీవాను జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ కలుసుకుని.. రీవాను స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కానిస్టేబుల్‌ అహిర్ ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి అహిర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఇంతకుముందు 2017లో కూడా రీవా ఓ యాక్సిడెంట్‌ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఐపీఎల్-11లో జడేజా చెన్నై తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే.