క్రికెట్ సౌతాఫ్రికా చేసిన కరోనా పరీక్షలో 6 పాజిటివ్... 

క్రికెట్ సౌతాఫ్రికా చేసిన కరోనా పరీక్షలో 6 పాజిటివ్... 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ను వణికించిన కరోనా ఇప్పుడు క్రికెట్ సౌతాఫ్రికా(సిఎస్ఎ) కు చేరింది. ఈ రోజు సిఎస్ఎ తాము నిర్వహించిన కరోనా పరీక్షలో మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఈ శనివారం జరగాల్సిన 3 టీ క్రికెట్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన సుమారు 50 పరీక్షల తరువాత వారిలో 6 పాజిటివ్ వచ్చింది కాని అందులో ఎవరు క్రికెటర్లు లేరు. "టీమ్ క్రికెట్ మ్యాచ్ కోసం సన్నాహకంగా, జూలై 10 నుండి 13 వరకు దేశంలోని వివిధ వేదికలలో క్రీడాకారులు, కోచ్‌లు, వేదిక సిబ్బంది సుమారు 50 మందికి కరోనా పరీక్షలు జరిగాయని క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్ఎ) తెలిపింది. ఈ  మ్యాచ్లు జూలై 18 శనివారం జరుగుతుందని సిఎస్‌ఎ చెప్పింది. అయితే అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది, కానీ ఆందులో ఆటగాళ్ళలో ఎవరు లేరు.  ప్రస్తుత డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ & నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ డిసీజెస్ (ఎన్ఐసిడి) మార్గదర్శకాల ప్రకారం ఈ పరీక్షలను సిఎస్ఎ మెడికల్ బృందం నిర్వహించింది'' అని వివరించింది. జూలై 18 న జరిగే '3 టీ క్రికెట్' పోటీ తో కరోనా వైరస్ కారణంగా వచ్చిన విరామం తరువాత దక్షిణాఫ్రికాలో క్రికెట్ ప్రారంభించాలని చూసింది సిఎస్ఎ.