మేము చూసిన అసాధరణ హిట్టర్‌లలో ధోని ఒక్కడు  : క్రికెట్ ఆస్ట్రేలియా 

మేము చూసిన అసాధరణ హిట్టర్‌లలో ధోని ఒక్కడు  : క్రికెట్ ఆస్ట్రేలియా 

మహేంద్రసింగ్ ధోనికి కేవలం మన  భారతదేశం లోనే కాదు విదేశాలలో కూడా  అభిమానులు  ఉన్నారు. ఇక ఈ రోజు ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనికి విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే విండీస్ ఆల్ రౌండర్ బ్రావో ఓ స్పెషల్ సాంగ్‌తో ధోనికి విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధోనీకి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆస్ట్రేలియా తన అధికారిక ట్వీటర్ ఖాతాలో ధోనీ అక్కడి గ్రౌండ్స్‌లో కొట్టిన సిక్స్‌ల సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. దానికి "మేము చూసిన అసాధరణ హిట్టర్‌లలో ధోని ఒక్కడు. అయితే ఈ రోజు ఆయన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా గ్రౌండ్స్‌లలో ఆయన బెస్ట్ సిక్స్‌స్" అనే క్సాప్షన్ తో వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఇప్పటి వరకు ధోనీ ఆస్ట్రేలియాపై 91 మ్యాచ్‌లు ఆడి 2,963 పరుగులు చేశారు.