ఏపీ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి..

ఏపీ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి..

విశాఖ ఉక్కు కోసం ఆత్మబలిదానాలు జరిగాయని.. ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్‌ అయ్యారు.  బిజిపి నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి అపోయింట్మెంట్ కూడా ఇవ్వలేదని..కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ పీకారని చురకలు అంటించారు.  లక్షల భూమిని కారుచౌకగా  ప్రైవేటు వ్యక్తులకు నరేంద్రమోదీ  కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని.. ఈ నెల 5న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. పోలీసులు, వాలంటీర్లు,  డబ్బులతో ఎన్నికల్లో వైసీపీ గెలుపొందుతుందన్నారు.  ఎవరు నామినేషన్ వేయాలి.. ఎవరు విత్ డ్రా చేయాలో పోలీసులే అదేశిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఏకగ్రీవం కావాలంటే డీఎస్పీలే చేస్తున్నారని.. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో అదే చేస్తున్నారని మండిపడ్డారు. ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు పోతాయని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.