తెలంగాణలో డేంజర్‌గా సెకండ్‌ వేవ్.. మూడో ప్రమాద హెచ్చరిక..!

తెలంగాణలో డేంజర్‌గా సెకండ్‌ వేవ్.. మూడో ప్రమాద హెచ్చరిక..!

ప్రపంచదేశాలను కోవిడ్ భయపెడుతూనే ఉంది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ స్టేజ్‌లో ఉండగా.. భారత్‌లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.. క్రమంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక, తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి కదులుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో కరోనా తాజా పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు వెల్లడించారు... గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ డేంజర్‌గా ఉందని హెచ్చరించిన ఆయన.. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమైనవిగా తెలిపారు.. ఇక, మున్ముందు ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, కరోనా కట్టడికి ఓవైపు వ్యాక్సినేషన్ పెంచిన సర్కార్.. మరోవైపు.. కరోనాబారిన పడకుండా.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత అవసరం అని మళ్లీ మళ్లీ చెబుతున్న సంగతి తెలిసిందే.