కరోనా అప్డేట్.. తెలంగాణలో ఇవాళ ఎన్నంటే..?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 267 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 351 మంది కరోనా బారినపడినవారు కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,86,893కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1583 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, భారత్‌లో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.11 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో 3,919 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,270 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇక, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 27,471 కరోనా టెస్ట్‌లు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 75,42,537కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది వైద్య ఆరోగ్యశాఖ. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 55 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)