భారత్ కరోనా అప్డేట్.. 93 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది... కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతూనే ఉంది.. రోజువారి కేసుల సంఖ్య 40 వేలలోపే నమోదు అవుతూ వచ్చినా.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ఆ సంఖ్య పెరుగుతోంది. దీంతో.. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 93 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,082 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 492 మంది మృతి చెందారు. ఇదే సమయంలో.. 39,379 మంది కరోనాబారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,09,788కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 87,18,517కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,35,715 మంది మృతిచెందగా... ప్రస్తుతం 4,55,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)