ధ‌ర్మ‌పురిలో క‌రోనా క‌ల‌క‌లం.. పెళ్లికి వెళ్తే 16 మందికి పాజిటివ్‌

ధ‌ర్మ‌పురిలో క‌రోనా క‌ల‌క‌లం.. పెళ్లికి వెళ్తే 16 మందికి పాజిటివ్‌

కంటికి క‌నిపించ‌ని క‌రోనావైర‌స్ ఎక్క‌డి నుంచి? ఎప్పుడు? ఎలా? ఎటాక్ చేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.. 10 మందితో క‌లిసినా అనుమానం.. బ‌య‌ట‌కు వెళ్లామంటే ఆందోళ‌నే.. ఇవాళ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కరోనా కలకలం సృష్టించింది.. ఒకేరోజు 16 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. గత వారం క్రితం ధర్మపురికి చెందిన అమ్మాయికి, మంచిర్యాలకు చెందిన అబ్బాయితో ధర్మపురిలో వివాహం జ‌రిపించారు పెద్ద‌లు.. అయితే, ఈ శుభ‌కార్యంలో పాల్గొన్నవారు దగ్గు, జలుబు, జ్వరంతో బాధ‌పడుతుండగా ఇవాళ‌ కరోనా పరీక్షలు నిర్వ‌హించారు.. ఈ పరీక్షల్లో వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న 16 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. ఇక‌, వివాహానికి వ‌చ్చిన‌వారిపై ఆరా తీస్తున్నారు.