కరోనాతో తల్లి చనిపోతే ఆన్లైన్ లో కర్మకాండలు నిర్వహించిన కొడుకులు

కరోనాతో తల్లి చనిపోతే ఆన్లైన్ లో కర్మకాండలు నిర్వహించిన కొడుకులు

కరోనా విజృంభించడంతో చనిపోయిన తల్లిదండ్రులకు కర్మకాండలు నిర్వహించే లేకపోతున్నారు కుటుంబ సభ్యులు. భీమవరంలో ఆన్లైన్లో కర్మకాండలు నిర్వహించింది ఓ కుటుంబం. తల్లి 11వ రోజు కార్యక్రమాన్ని అమెరికా, బెంగళూరులో ఉన్న కుమారులు ఆన్లైన్ లో నిర్వహించారు. పద్మావతికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త, ఒక కుమారుడు బెంగళూరు, మరో కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. బెంగళూరులో కర్మకాండలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో భీమవరం నుంచి ఆన్లైన్ లోనే కర్మకాండలు చేసారు. పురోహితులు సూచించిన విధంగా సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.