కరోనా సోకితే 90 రోజుల వరకే సేఫ్.. మళ్లీ ప్రమాదం..!

కరోనా సోకితే 90 రోజుల వరకే సేఫ్.. మళ్లీ ప్రమాదం..!

దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, కోవిడ్‌పై శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి కరోనా సోకి నయమైతే జీవితంలో మళ్లీ వైరస్ దరిచేరదని ఇప్పటివరకు వింటున్నాం. అయితే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి 90 రోజుల వరకే సేఫ్ అని.. ఆ తర్వాత వైరస్ సోకే అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ తగ్గిన వారు.. మూడు నెలల తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మరోసారి కరోనా బారిన పడే ఛాన్స్ ఉంది. వైరస్ వచ్చిన 28 రోజుల తర్వాత సదరు వ్యక్తి శరీరంలో వైరస్ జాడలేకున్నా.. వైరస్ వాహకంగా మారే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్‌కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. అదీ ఏడాది వరకు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. చికెన్ ఫాక్స్, హెచ్ఎఫ్ఎమ్ వ్యాధులకు సంబంధించి అభివృద్ధి చెందే ఐజీజీ యాంటిబాడీస్ జీవితకాలం 60 నుంచి 90 రోజులు మాత్రమే ఉంటాయి. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఐజీజీ యాంటీబాడీస్ శరీరంలో అభివృద్ది చెందినా.. అవీ ఏడాదికి మించి శరీరంలో ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, వైరస్ సోకిన వ్యక్తి శరీరంలోకి నాలుగురోజుల తర్వాత ఐజీఎమ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. తర్వాత వ్యాధి తీవ్రస్థాయికి చేరి.. వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తులు, నాడీమండలం, రక్త సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. వైరస్ ప్రవేశించిన 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీ బాడీస్ డెవలపవుతాయి. ఐజీజీ యాంటీబాడీస్ సంఖ్య పెరిగేకొద్దీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 14వ రోజు నాటికి శరీరంలో వైరస్‌పై రోగనిరోధక శక్తి ఐజీజీ యాంటీబాడీస్ సాయంతో ఆధిపత్యం వహిస్తుంది. అందుకే రోగికి కరోనా వల్ల ఇబ్బందులు లేవు అని వైద్యులు నిర్దేశిస్తున్నారు. దీనిని ఆధారంగా తీసుకొని తిరిగి టెస్టులు నిర్వహించకుండానే ఇంటికి పంపిస్తున్నారు. నిజానికి...ప్రతీ రోగి 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీబాడీస్ ఒకేలా డెవపల్ కావు. ఒకవేళ అయినా.. పెద్ద సంఖ్యలో శరీరంలో చేరినంత మాత్రానా కరోనా పూర్తిగా నయమైనట్టు కాదు. వైరస్ వల్ల రోగికి నష్టం వాటిల్లకుండా యాంటీబాడీస్ రక్షిస్తాయి. 14వ రోజు తర్వాత రోగి శరీరం నుంచి వైరల్ లోడ్ ఉంటుంది. ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.