మహాకల్లోలం... బయటపడటం కష్టమేనా?
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి కర్ఫ్యూ, ఉదయం 144 సెక్షన్, వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. బుధవారం రోజున రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇక ఇదిలా ఉంటె నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 322 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్ కేసులతో పాటుగా తీవ్రత పెరుగుతుండటం, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కల్లోలం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలనీ చూస్తున్నది. సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేసింది. సమూహాలపై దృష్టి సారించింది. టెస్టులను పెంచడంతో పాటుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయినప్పటికీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అతిపెద్ద మురికివాడ ధారవిలో సెకండ్ వేవ్ భయం పట్టుకుంది. ధారవిలో సెకండ్ వేవ్ విజృంభిస్తే కట్టడి చేయడం సాధ్యం అవుతుందా ? ఎప్పటికి సెకండ్ వేవ్ నుంచి రాష్ట్రం బయటపడుతుంది?
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)