రిపబ్లికన్ పార్టీ కేసును రద్దు చేసిన కోర్టు

రిపబ్లికన్ పార్టీ కేసును రద్దు చేసిన కోర్టు

వాషింగ్‌టన్: అమెరికా ఎన్నికల తరువాత రిపబ్లికన్ పార్టీవారు ఆరిజోనా బ్యాలెట్స్ ఆడిట్ కోరుతూ కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై కోర్టు తన నిర్ణయం వినిపించింది. దీని కారణంగానే గత 20 సంవత్సారాల్లో ఎన్నికలు డెమొక్రాట్స్ వైపుకు తిరిగాయని వారు దావాలో పేర్కొన్నారు. అందచేతనే దేశంలోని అతిపెద్ద బ్యాలెట్‌లలో ఆరిజోనా కూడా ఒకటి, దాని బ్యాలెట్ లెక్కలను చూపాలని రిపబ్లికన్ పార్టీ కోర్టుకెక్కింది. ఇందుమూలంగానే ఎన్నికల లెక్కింపులు ఇంకా పూర్తికాలేదు. అయిత రిపబ్లికన్ పార్టీ దావాను కోర్టు కొట్టిపారేసింది. అయితే గత వారం కోర్టు మారికోపా కౌంటీని నిబందనలను అతిక్రమించినందుకు గానూ నిందించింది. ‘ ఆరిజోనా ప్రజలకు ఎన్నికల తీరుపై పూర్తి నమ్మకం ఉండాలి. అంతేకాకుండా కేవలం సరైన బ్యాలెట్‌లు మాత్రమే లెక్కింపు అవుతాయని వారు నమ్ముతారు. అందులో ఓడిపోతే అది దేశం ఓడిపోయినట్లేన’ని రిపబ్లికన్ పార్టీ అధికారిణి అన్నారు. ఆరిజోనాలో బైడెన్ 0.3 శాతంతో విజయం సాదించాడని, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1996లో గెలిచాక మళ్లీ ఒక డెమోక్రోట్ గెలవడం ఇదే మొదటిసారని అధికారులు అన్నారు. అయితే ఇప్పడు ఈ సమస్యను ఎలా పరిష్టరిస్తారో వేచి చూడాలి.