క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. నేటి నుంచి ఐపీఎల్ షురూ..
నేటి నుంచి ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో... యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవాళ అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దాదాపు 15 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ధోనీ, ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే. దాంతో ధోనీ మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్లో ఓపెనర్‌గా వస్తానని ప్రకటించాడు. దాంతో హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్. ఆరు నెలలుగా అసలు సిసలైన క్రికెట్ మజాను మిస్ అయిన ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ చాలారోజుల తర్వాత కిక్ ఇవ్వనుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం. ఇప్పటి వరకు మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి కూడా ట్రోఫీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫేసర్ బ్రెట్‌లీ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)