కరోనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు..

కరోనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిసూనే ఉంది. అగ్ర రాజ్యమని లేదు..పేద దేశమని లేదు.. అంతటా విశ్వరూపం చూపిస్తూ కరాళ నృత్యం చేస్తోంది కరోనా వైరస్. మహమ్మారి ధాటికి అమెరికా సైతం చివురుటాకులా వణికిపోతోంది. దేశవ్యాప్తంగా 3 లక్షల 92 వేల కేసులు దాటగా., 12 వేల 500 మందికి పైగా మృతి చెందారు. రోరోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లడమే తప్ప ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 18 కంటే తక్కువ వయసున్న వారు రెండు శాతం కంటే తక్కువగా ఉంది.

యూరప్‌లో కరోనా మరింతగా కోరలు చాస్తోంది. 50 వేల మందికిపైగా అక్కడ మృత్యువాతపడ్డారు. ఇటలీలో 16,523 మంది చిపోయారు. స్పెయిన్‌  14  వేల మంది మృత్యువాత పడ్డారు.  ఇక 10 వేలకు పైగా మరణాలతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  జర్మనీలో కూడా  పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటాయి.   మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు.  జపాన్‌లోనూ వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని కొనసాగిస్తోంది. కరోనా వల్ల ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటి వరకూ 3,906 మంది వైరస్‌ బారినపడగా.. వీరిలో 9 2 మంది మరణించారు. స్పెయిన్‌లో కరోనా మారణహోమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు   13, 912 మంది వైరస్‌ ధాటికి కన్నుమూశారు. మొత్తం 1,40,617మందికి ఈ మహమ్మారి సోకినట్లు గుర్తించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 82,083 మంది ఇప్పటి వరకు మృతిచెందగా... 14,31,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.