భారత్‌ కోవిడ్ అప్‌డేట్.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు

భారత్‌ కోవిడ్ అప్‌డేట్.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 15,968 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 202 మంది మృతిచెందగా.. 17,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,29,111  మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మరోవైపు ఇప్పటి వరకు 1,51,529 మంది కరోనాతో మృతిచెందారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 8,36,227 కరోనా శాంపిల్స్ పరీక్షించామని.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 18,34,89,114కు చేరుకుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కాగా, గత బులెటిన్‌ ప్రకారం దేశవ్యాప్తంగా 12,584 కొత్త కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగి 15,968కు చేరుకుంది.